తిరుమలకు వీటితో వెళ్లొద్దు!

మీరు తిరుపలకు వెళ్తున్నారా.. అయితే మీరు తప్పక టీటీడీ ఆదేశాన్ని పాటించాల్సిందే. పరమ పవిత్ర హిందూ దేవాలయంగా విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రంలో కొన్ని వస్తువులతో రావద్దంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది.

భక్తులు అన్యమత చిహ్నాలు, పార్టీల జెండాలు, వ్యక్తుల ఫొటోలతో తిరమలకు రావద్దంటూ టీటీడీ కోరింది. అలాంటి వాటితో వచ్చే వారి వాహనాలను అలిపిరి చెక్ పోస్టు వద్దే నిలిపేస్తామని స్పష్టం చేసింది.

పవిత్రమైన తిరుమలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే గతంలో కొందరు అన్యమతాలకు చెందిన జెండాలు, వస్తువులతో తిరుమలలో సంచిరించినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.