ప్రపంచ వింతైన కట్టడాల్లో ఒకటైన తాజ్ మహాల్ లో మూసివేసి ఉంచిన 20 గదులను తెరవాలన్న చర్చ మళ్లీ వచ్చింది. దీంతో అసలు ఆ గదుల్లో ఏమున్నాయి. ఎందుకు మూసి ఉంచారు. తెరిస్తే వచ్చే నష్టమేమిటి అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
తాజ్ మహాల్ 20 గదులను తెరిచేలా పురావస్తు సర్వే విభాగాన్ని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య జిల్లా ఇన్ చార్జి డాక్టర్ రజనీశ్ ఈ పిటిషన్ వేశారు. 2020లోనే కేంద్ర సాంస్కృతిక శాఖకు తాను దరఖాస్తు చేసినట్లు రజనీశ్ చెప్పారు.
అయితే తన దరఖాస్తుకు కేవలం తాళాలు వేసి ఉన్నట్లుగానే ఆ శాఖ తెలిపందని, సరైన సమాచారం దొరకలేదని తెలిపారు. తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతోనే కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. నిజానిజాల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో ఆయన కోర్టును కోరారు.
ఆ 20 గదుల్లో హిందువుల విగ్రహాలున్నాయని, హిందూ రాజుల శాసనాలు ఉన్నాయన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉందని రజనీశ్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని కోరారు. అయితే దీనిపై హైకోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.
అయితే తాజ్ మహాల్ లోని ఆ 20 గదుల్లో ఏమున్నాయని దేశవ్యాప్తంగా మరోసారి ఉత్కంఠకు తెరలేసింది. ప్రస్తుతమైతే ఆ గదుల్లో ఏముంటాయన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.