అందాల ఆరబోత

సినీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. 2014లో విరాట్టు అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంతో ఆమె సినీ రంగంలో ప్రవేశించింది.

మొదట్లో అందాల పోటీల్లో పాల్గొన్న జైస్వాల్ అనేక బహుమతులు పొందింది. ఆ తర్వాత మోడల్ గా మారింది. తెలుగులో 10 చిత్రాల్లో నటించిన జైస్వాల్ ఇటీవలే ఘన విజయం సాధించిన అఖండ సినిమాతో మరింత గుర్తింపును తెచ్చుకుంది.

ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన అందచందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. స్వతహాగా మోడల్ అయిన ఆమె హొయలొలికిస్తూ దిగిన ఫొటోలు అభిమానులను అలరించేలా ఉన్నాయి.

ఓ గుహలో నుంచి తెల్లని వర్ణంలో పొట్టి దుస్తులతో మెరుస్తూ వస్తున్న అప్సరసలా ఉన్న ఆమె తన అందచందాలను మరింత ద్విగిణీకృతం చేసినట్లు ఉంది.