ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి..

ఏస్వప్నలోకాల సౌందర్య రాశి.. మాముందుకొచ్చింది కనువిందు చేసి.. అన్న పాట గుర్తుకొస్తుంది కదూ ఈమెను చూస్తే.. ఆమె ఎవరో కాదండి.. మన బుల్లితెరపైనే కాదు, వెండి తెరపైనా అందం, అభినయంలో తన స్థానం సుస్థిరం చేసుకున్న నటి అనసూయ.

అప్పుడప్పుడూ సోషల్ మీడియాతోనూ ఆమె తన అందచందాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.

అనసూయ గతంలో ఎన్నోమార్లు పొట్టి డ్రెస్సులతో తన అందచందాలను పంచుకున్న ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. అయితే ఆమె కూడా గట్టిగానే జవాబిచ్చి తన శైలిని కొనసాగిస్తూనే ఉంది.

అనసూయ షార్ట్ డ్రెస్సులు, నెక్కర్లలోనే కాదు చీరలలోనూ ఆమె అందం మరింత ఇనుమడింపజేస్తోందని పలువురు మెచ్చుకోవడం విశేషం.

ఇలా తాజాగా ఓ టీవీ కార్యక్రమం కోసం ఇలా అందంగా తయారైనట్లు సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను ఆమె పంచుకున్నారు.