దళితుల బతుకుల్లో విప్లవాత్మక మార్పు

• కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ : దళితబంధు పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది.. దీనితో ఆయా కుటుంబాలు ఆర్థిక వృద్ధి సాధిస్తాయి.. అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన 58 మంది లబ్ధిదారులకు మంగళవారం ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు. వారిలో35 మందికి డైరీ పామ్ యూనిట్లను, 23 మందికి వాహనాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో నాంది పలికామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల కోసం నేరుగా రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. దళిత సంక్షేమంలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నిన్నటివరకు కూలీలుగా, డ్రైవర్లుగా పని చేసిన వారికి నేడు వాహనాలకు యజమానులుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్, మార్కెట్  చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్, ఎమ్మార్వో, ఎంపీడీవో పాల్గొన్నారు.

ఇంకా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, నాయకులు గంటా శ్రీనివాసరావు, సొసైటీ ఛైర్మన్లు రమేష్, నలజాల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ కుమార్, సర్పంచులు దొంగరి లక్ష్మీనారాయణ, పాముల మస్తాన్, మీసాల శోభారాణి, సుశీల బెంజిమెన్, భూక్యా సైదా, రమావత్ పద్మ జబ్బార్, కామిశెట్టి నర్సింహారావు, ఉద్దండు,కలకొండ బాలకృష్ణ,వెంకట్ రెడ్డి, గీత, గ్రామశాఖ అధ్యక్షుడు సలీం, వీరబాబు, బాబ్జి,శ్రీనివాస రెడ్డి, పాపారావు, మదన్, చంధ్యా, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.