కూకట్ పల్లిలో విషాదం

• వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి మృత్యువాత

కూకట్ పల్లి : హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై నిర్మాణంలో ఉన్న ట్యాంకు గోడకూలి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.

శారోన్ దిత్య (4) తన తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.