బైక్ కాస్ట్ రూ.71 వేలు, నెంబరుకు రూ.15 లక్షలు

మీరు చూసింది, నేను చెప్పింది నిజమే.. ఎక్కువ మంది వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుకుంటారు. కూడికలు, తీసివేతలతో తమ లక్కీ నెంబర్ వస్తుందో రాదో లెక్కలేసుకుంటారు.
కొందరైతే ఫ్యాన్సీ నెంబర్లను కొనుక్కుంటారు. మరికొందరైతే ఎంత కాస్ట్లీ అయినా కొనటానికి వెనుకాడరు. ఈయన ఆ కోవకు చెందిన వారే.

ఛండీగఢ్ కు చెందిన బ్రిజ్ మోహన్ ఇటీవలే రూ.71 వేలతో యాక్టివా కొన్నారు. దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో పోటీకి వెళ్లాడు. ఏకంగా రూ.15.44 లక్షలతో ఫ్యాన్సీ నెంబరును కొన్నాడు. ఆ వేలంలో సీహెచ్ 01-సీజే-0001 అనే నెంబరును దక్కించుకున్నాడు.

రూ.71 వేల విలువైన యాక్టివా వాహనం కోసం 20 ఇంతలకు పైగా నగదు పెట్టి ఫ్యాన్సీ నెంబరును వేలంలో కొనడంపై అక్కడి వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వారు కూడా ఉంటారా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ ఫ్యాన్సీ నెంబరును తన యాక్టివాకు వాడుకుంటానని, భవిష్యత్ లో తాను కొనబోయే కారుకు ఇదే నెంబరును వాడుకుంటానని ఆ గురుడు తేల్చిచెప్పాడు. అయినా ఇంత భారీగా ఖర్చు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.