‘ముద్దు’గుమ్మలు

సినీ తారలు అందానికే ప్రాధాన్యమిస్తారు. అప్పుడప్పుడూ తమ అందచందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అవకాశాల కోసమూ హావభావాలను పంచుతూ ఫొటోల ద్వారా రక్తి కట్టిస్తుంటారు.

కొందరు హొయలొలుకుతూ, వయ్యారాలు పోతూ కురచ డ్రస్సులతో సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. నటన, మోడల్ పరంగా, వ్యాపార ప్రకటనల కోసం అదిరిపోయేలా అలంకరించుకుంటారు.

కొందరు సినీ హీరోయిన్లు తమ అందచందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ :

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో ఉంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో నటించినా ఒక్క తెలుగులోనే 16 సినిమాల్లో నటించింది. తెలుగులో కెరటం సినిమాతో అరంగేట్రం చేసింది.

నేహా శర్మ :

బీహార్ బ్యూటీ అయిన నేహా శర్మ 2007లో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించింది. మరో సినిమా కుర్రాడులోనూ యాక్ట్ చేసింది. హిందీలో అత్యధిక చిత్రాల్లో పనిచేసింది.

కేతికా శర్మ :

న్యూఢిల్లీ అమ్మాయి కేతికా శర్మ తెలుగులో ఇటీవలే వచ్చిన రొమాంటిక్ సినిమాలో నటించి మెప్పించింది. ఆకాష్ పూరితో కలిసి సినిమాలో ఆకట్టుకొందని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. నాగశౌర్యతో లక్ష్యం సినిమాలోనూ నటించింది.

నభా నటేష్ :

కన్నడ బ్యూటీ నభా నటేష్ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నటించింది. తెలుగులో 5 సినిమాల్లో నటించగా, కన్నడలో 3 చిత్రాల్లో నటించింది.