జోగు మంజులకు ఉమెన్ లీడర్‌షిప్ జాతీయ అవార్డు

నిఘా, హైదరాబాద్ : బహుజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) అందజేసే ప్రతిష్టాత్మక ‘ఉమెన్ లీడర్‌షిప్ నేషనల్ అవార్డు-2022’కు దళిత ఐక్య వేదిక సమితి కూకట్‌పల్లి సెక్రటరీ జోగు మంజుల ఎంపికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంస్థ జాతీయ కార్యాలయంలో బీఎస్ఏ నేషనల్ కో-ఆర్డినేటర్ నల్లా రాధాకృష్ణ ఎంపిక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగద్గిరిగుట్టకు చెందిన మంజుల దళిత మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, ఆమె సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. మహిళల హక్కులు, వాటి సాధికారత కోసం అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారని కొనియాడారు. నవంబర్ 13న ఢిల్లీలో జరిగే నేషనల్ కాన్ఫరెన్సులో బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.