రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీకగౌడ్

రచ్చబండ : ప్రముఖ యాంకర్, సోషల్ వర్కర్ కత్తి కార్తీక గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు చేరిక విషయమై ఆ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో ఆమె చేరనున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ సమక్షంలో కార్తీక గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

హైదరాబాద్ నగరానికి చెందిన కార్తీకగౌడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. 2020లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. కొన్నాళ్లకు ఆ పార్టీకి ఆమె రాజీనామా చేశారు.