కృష్ణా జిల్లాలో దారుణం.. కత్తితో ప్రేమోన్మాది దాడి.. నలుగురికి గాయాలు

రచ్చబండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న సాకుతో ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మొవ్వం మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన నాగదేసి జోయల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదన్న కసితో కత్తితో నలుగురిపై దాడి చేశాడు. దుండగుడు విచక్షణారహితంగా పొడిచాడు.

ఈ దాడిలో అదే కాలనీకి చెందిన బల్లారపు నిఖిత (22), బల్లారపు అఖిల (21), బల్లారపు రాజరాజేశ్వరి, బల్లారపు నగరాజ్యం (40) గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.