రచ్చబండ : తన భార్య మరొకరితో వెళ్లిందన్న దిగులు పెట్టుకున్నాడు. మూడు రోజులపాటు మదనపడ్డాడు. చివరకు ఆ వ్యక్తి తనువు చాలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ నగర్ కు చెందిన కవిందర్ గురుగ్రామ్ లోని కసన్ అనే గ్రామంలో తన భార్య రీనాతో కలిసి నివసిస్తున్నాడు. అదే గ్రామంలో కవిందర్ సోదరుడైన సంతోష్ కుమార్ కుటుంబం కూడా ఉంటోంది.
కవిందర్ క్యాబ్ నడుపుతూనే మరో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య ఇంటి వద్దే ఉండేది. ఆమె అదే గ్రామంలో ఉండే రాంవీర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు.
ఆమె తన దుర్భుద్ధిని మానలేదు. ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ తన ప్రియుడితో పారిపోవాలని నిర్ణయించుకుంది. ఈనెల 10న రీనా తన ప్రియుడు రాంవీర్ తో కలిసి కొందరు స్థానికుల సాయంతో పారిపోయారు.
విషయం తెలుసుకున్న కవిందర్ తన భార్య, ఆమె ప్రియుడిపై స్థానిక ఐఎంటీ మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండురోజుల పాటు మదన పడ్డాడు. తన భార్య మరొకరితో లేచిపోయిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలిసిన సంతోష్ కుమార్ తన సోదరుడైన కవిందర్ ఇంటికి వెళ్లగానే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కవిందర్ చనిపోయాడని అక్కడి వైద్యులు నిర్ధారించారు.
ఈ మేరకు రీనా, రాంవీర్ పై ఐఎంటీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. వారి జాడ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి కొందరు కుటుంబ బంధాలు కాలదన్నుకుంటూ కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.