రచ్చబండ : ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క శుక్రవారం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. గతంలోనే ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆమె తాజాగా ఈ పరీక్ష రాసినట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
పరీక్ష రాసిన అనంతరం సీతక్క మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా.. స్టూడెంట్ లైఫ్ బెస్ట్ లైఫ్ అంటూ చెప్పారు. ఈ సందర్భంగా పరీక్ష రాసిన తోటి అభ్యర్థులు సీతక్కతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.