మంగళగిరిలో దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి బలవన్మరణం

రచ్చబండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన ఐదు నెలలకు భర్తతో ఏర్పడిన తగాదాతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

వీవర్స్ కాలనీకి చెందిన కందుల సమంత (21)కు ఫేస్ బుక్ ద్వారా తణుకు పట్టణానికి చెందిన నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఐదు నెలల క్రితం వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

కొత్తగా పెళ్లి కావడంతో ఆషాడమాసంలో సమంత సొంతూరైన మంగళగిరికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక
సెల్ ఫోన్లో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. శుక్రవారం కూడా గొడవ పడ్డాక అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

భర్తతో జరిగిన గొడవతోనే మనస్తాపంతోనే సమంత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.