విజయవాడలో దారుణం

తెలంగాణలోని కోదాడ పట్టణంలో ఇద్దరు దుండగులు ఓ యువతిని సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయవాడ నగరానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన విషయం మూడురోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. అదీ నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకొంది. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు సమాచారం.

తెలిసిన వ్యక్తే ఆ యువతిని తన వెంట తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో యువతి అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి మరీ దుండగులు దారుణానికి పాల్పడ్డారు.

మతి స్థిమితం లేని అమ్మాయిని తెలిసిన వ్యక్తే తన వెంట తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురుకు మతిస్థిమితం లేదని, ఏమీ చెప్పలేకపోతోందని చెప్పారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.