సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో 8మంది మృత్యువాత.. మృతులు ఐదుగురు వీరే!

రచ్చబండ, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకూ 8మంది మృత్యువాత పడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా, సెల్లారులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలి ప్రమాదం జరిగిందా.. అనేది తేలాల్సి ఉంది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో చికిత్స జరుపుతున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మృతుల్లో ఐదుగురి వివరాలు తెలిశాయి. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులు విజయవాడకు చెందిన అల్లాడి హరీశ్ (33), వీరేంద్రకుమార్ (50), ఢిల్లీకి చెందిన సీతారామన్ (40), సందీప్ మాలిక్, చెన్నైకి చెందిన బాలాజీ (58), రాజీవ్ మైక్ (26)తో పాటు ఢిల్లీకి చెందిన ఓ మహిళతో పాటు మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.