ఆ చిన్న కారణంతో భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఆదికాలం నుంచి భార్యలపై భర్తల పెత్తనం కొనసాగుతూ వస్తోంది. ఆడదంటే ఆట వస్తువుగా భావించిన ఎందరో పురుషులు ఇష్టారీతిన వేధింపులకు పాల్పడుతూ వస్తున్నారు. భర్త వేధింపులను పంటి బిగువును ఎందరో భరిస్తున్నారు. వారి భారిన పడి మరెందరో తనువులు చాలిస్తున్నారు.

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది. చిన్న విషయానికే చిర్రెత్తుకొచ్చిన కోపంతో తన భార్యను కొట్టి హతమార్చాడో ఘనుడు.

నోయిడాలోని సెక్టార్-66లో అనుజ్ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర గా పనిచేస్తూ అక్కడే తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆటో నడిపేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సరికి అతని భార్య వంట చేయలేదు.

దీంతో భార్యతో అతను వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలోనే అసహనంతో ఇంట్లో ఉన్న పెనంతో ఆమె తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలిడిసింది. వెంటనే నిందితుడు పరారయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని మంగళవారం వెతికి పట్టుకొచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.