అబ్బో మనోడు అత్యధిక సార్లు ఒకే సినిమా చూసిన ఘనుడు.. ప్రపంచ రికార్డు!

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఆటల్లో.. పాటల్లో.. చదువుల్లో కాదు.. సినిమా చూడటంలో మనోడు రికార్డు సృష్టించాడు. ఐదు, పది సార్లు కాదు.. ఏకంగా 50 సార్లు ఒకే సినిమా తిలకించి ప్రపంచ రికార్డునే సొంతం చేసుకున్నాడు.

విశ్వనటుడిగా గుర్తింపు ఉన్న కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో కమల్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆయనకు వీరాభిమాని అయిన తమిళనాడుకు చెందిన ఉదయ భారతి విక్రమ్ సినిమాను థియేటర్లలో 50 సార్లు చూశాడు.

ఈ మేరకు అత్యధిక సార్లు ఒకే సినిమాను చూసిన ప్రేక్షకుడిగా ‘లింకన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ గా వరల్డ్ రికార్డు హోల్డర్ గా గుర్తిస్తూ ఉదయ భారతికి ప్రశంసాపత్రం అందించింది. అబ్బో మనోళ్లు సినిమా చూడటంలో దిట్టలే అన్నమాట.