కృష్ణంరాజు కూతుళ్ల పేరేమిటి? వారి గురించి మీకు తెలుసా?

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూయడంతో ఆ కుటుంబంతో పాటు సినీలోకం శోక సముద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు తన వారసుడిగా ప్రకటించుకున్న ప్రభాస్ శోకాతప్త హృదయంతో ఉన్నారు. ఆయన సన్నిహితులు కూడా విషాదవదనంలో ఉన్నారు.

కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవితో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రసీద లండన్ నగరంలో ఎంబీఏ చదివారు. ఆమె ప్రభాస్ చిత్రం రాధేశ్యామ్ తో సిర్మాతగా సినీ రంగంలోకి ప్రవేశించారు.

రెండో కూతురు ప్రకీర్తి హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. మూడో కూతురు ప్రదీప్తి సైకాలజీ డిగ్రీ పూర్తి చేశారు. కృష్ణంరాజు మొదటి భార్య కూతురు కూడా ఆయన వద్దే ఉంటోంది. అయితే వీరితో పాటు కన్నకొడుకులా భావించే ప్రభాస్ వివాహం చూడకుండానే కృష్ణంరాజు కన్నుమూయడంతో ఆ కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది.