రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో ఇష్టం. అయనాతో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుకుంటున్నా. ఆయనతో నటించే చాన్స్ వస్తే ఎంత బాగుండు అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పా.. ప్రతి రోజూ దేవుడిని కోరుకునేదాన్ని.. అది ఇప్పుడు నిజమైంది.. అని తన మనసులోని కోరికను వెలిబుచ్చారు నేటి క్రీజీ అందాల తార.
ఈమె ఎవరో కాదు.. అలనాటి అందాల తార కూతురు జాన్వీకపూర్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు జాన్వీ. ఈ సందర్బంగా ఆమె స్పందించారు. సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా.. రోజు డైరెక్టర్ కు మెస్సేజ్ చేస్తున్నా.. అని ఆసక్తిని వ్యక్తపర్చారు.
ఇటీవలే అరారార్ సినిమా చూశా.. అయన అందం, ఉత్సాహం మరో స్థాయిలో ఉంటాయి.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్నితెలిపింది జాన్వీకపూర్. మరి ఆ సినిమా తెరకెక్కేదెన్నడో.. ఆమె కోరిక నెరవేరేదెన్నడో వైట్ చేద్దాం.
ఒకప్పుడు తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా కొనియాడబడిన నవరస నటనా సార్వభౌమ బిరాధాంకితుడు నందమూరి తారక రామారావు, అందాల తార శ్రీదేవి జంటగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ జోడి యమ క్రేజీగా ఉండేదని అభిమానులు మెచ్చుకునేవారు.
హీరోయిన్గా శ్రీదేవిని హీరోగా ఎన్టీఆర్ ఆటపట్టించే కొంటె సన్నివేశాలను చూసి జనం మురిసిపోయేవారంటే అతిశయోక్తి కాదు. మరి వారి వారసులుగా వచ్చి సినిమాల్లో మెప్పించే స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటను సినీ అభిమానులు ఎలా ఆస్వాదిస్తారో వేచి చూద్దాం.