రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : నిజమే.. ఆ దేశంలో ఆనందపడే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. సంతోషమనేది వారికి కలగానే ఉంది. నిత్యం జీవన సమరం కోసం మనో వేదనతోనే కాలం వెల్లదీస్తున్నారన్న మాట. ఓ సర్వేలో కూడా అత్యధికంగా బాధపడే వారు ఉన్న దేశాల గురించి చేసిన సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.
సంతోషంగా లేని దేశాల జాబితాలో ఆఫ్ఘానిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. గలప్స్ ఎక్స్ పీరియన్స్ ఇండెక్స్ ప్రకారం 80 శాతం ఆఫ్గాన్లు ఆందోళనకర జీవనం కొనసాగిస్తున్నారని తేలింది.
70శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతుండగా, 61శాతం మంది నిత్యం దిగులుతో బతుకీడుస్తున్నట్లు తేలింది. పేదరికం, నిరుద్యోగంతో కోపం, ఆందోళన మొదలైన వాటి వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య ఆ దేశంలో ఎక్కువగా ఉందట.