వధువుతో వరుడి స్నేహితుల ఒప్పందం.. సంతకం పెట్టాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్!

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : మావాడిని పెళ్లి చేసుకోవాలంటే.. మా కండీషన్ కు ఒప్పుకోవాలి.. దానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి.. అప్పుడే మేము పెళ్లికి ఒప్పుకుంటాం.. లేదంటే ఒప్పుకోబోం.. అంటూ వరుడి స్నేహితులు వధువుకు ఓ కండీషన్ పెట్టారు. మరి వధువు ఒప్పుకుందా.. లేదా చూద్దాం రండి.

తమిళనాడు రాష్ట్రంలోని ఉసిలంబట్టిలో నూతన వధూవరులకు పెళ్లి వేడుకకు నిశ్చయించారు. దానికి ముందు తమ ఒప్పందపత్రంపై వధువు సంతకం చేయాలని పట్టుబట్టారు. వారి కుతూహలానికి ఒప్పుకున్న వధువు సంతకం చేసింది.

పెళ్లి జరిగాక తమ స్నేహితుడిని తమతో క్రికెట్ ఆడనివ్వాలి.. అని వరుడు హరిప్రసాద్ స్నేహితులు కండీషన్ పెట్టారు. అయితే ససేమిరా అన్న వధువు కొద్దిసేపట్టికి ఒప్పుకుంది. ఎలాగంటే కేవలం శని, ఆదివారాలకే అనుమతి ఇస్తా.. అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

ఉస్సూరుమన్న స్నేహితులు రెండు రోజులకైనా పర్మిషన్ దక్కిందని ఒప్పంద పత్రంపై వధువుతో సంతకాలు చేయించారు. ఆ తర్వాతే పెళ్లికి అంగీకరించడంతో తంతు కానిచ్చేశారు. ఇదన్న మాట విషయం.