ఆ ఊరిలో ఒక్క నెలలోనే 15 మంది పురుషుల మృత్యువాత.. వీడని మిస్టరీ

రచ్చబండ : ఆ ఊరిలో ఏదో జరుగుతోంది. వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుబట్టని ఆ విషయంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. కేవలం పురుషుల వరుస మరణాలు ఏదో కీడును శంకిస్తున్నాయ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలోని మాన్ సింగ్ తండాలో కేవలం 90 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ గ్రామంలో పురుషులు వరుసగా మరణిస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే గత ఆగస్టు నెలలోనే 15 మంది మృత్యువాత పడ్డారు.

కిడ్నీ సమస్యలతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. మొదట ఒళ్లు నొప్పులు, కొద్దికాలానికి కదల్లేని పరిస్థితి నుంచి కిడ్నీలు పాడై మరణం అంచుకు చేరుకున్నారు.

అధిక ధరలతో మద్యం కొనలేని స్థితిలో ఉన్న గిరిజనులు నాటుసారాను ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దానివల్లే వారి అరోగ్యాలు పాడై ఉండొచ్చని భావిస్తున్నారు. మరి వాస్తవమేంటో లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది.