ఉత్తమ్ ను కలిసిన గద్దర్, వినోద్ వెంకటస్వామి.. గద్దర్ ను హత్తుకొని ఆప్యాయత పంచుకున్న ఎంపీ

రచ్చబండ : ప్రజా కవి గద్దర్, మాజీ మంత్రి వినోద్ వెంకటస్వామి సోమవారం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాఖ్య ఆఫీసు బేరర్లు కూడా కలిశారు.

నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేలా ప్రభుత్వంతో చర్చించేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా వారు కోరారు. వారి వినతికి ఉత్తమ్ పూర్తిగా ఏకీభవించారు. ప్రజాస్వామ్య దేవాలయానికి రాజ్యంగ రూపశిల్పి పేరు పెట్టడం చాలా సముచితమైని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఎంపీ ఉత్తమ్, గద్దర్ ను హత్తుకొని ఆలింగనం చేసుకొని ఆప్యాయతను పంచుకున్నారు. అనంతరం ఎంపీ వారితో ఆహ్లాదపూరితంగా చర్చలు జరిపారు.