బతుకమ్మ చీరలు రెడీ.. ఎన్ని రంగులు.. డిజైన్లు.. ఖర్చెంతో తెలుసా?

రచ్చబండ : తెలంగాణలో సంప్రదాయ సిద్ధంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రతీ ఏటా మహిళలకు పంచే బతుకమ్మ చీరలను ఈ సారి కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల చివరి వారం నుంచి జరుపుకునే ఈ పండుగ కోసం పలు రకాల చీరలను సిద్ధం చేసి ఉంచింది.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేసేందకు 1.18 కోట్ల చీరలు సిద్ధమయ్యాయి. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేయించిన చీరలను 33 జిల్లాల్లోని అర్హులైన మహిళలకు పంపిణీ చేయనున్నారు.

ముప్పై రంగుల్లో 240కి పైగా డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లలో చీరలు తయారు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీ కోసం ప్రభుత్వం రూ.340 కోట్లను కేటాయించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ వెల్లడించింది.