రచ్చబండ, హైదరాబాద్ : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ) మీడియా కమిటీ చైర్మన్ గా కే సత్యనారాయణ నియమితులయ్యారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సత్యనారాయణ ఫిలింనగర్ క్లబ్ మీడియా, వెబ్ సైట్, న్యూస్ లెటర్, సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఎఫ్ఎన్సీసీ అధ్యక్ష, కార్యదర్శులు ఘట్టమనేని శేషగిరిరావు, ముళ్ళపూడి మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం ప్రకటించారు.
ఎఫ్ఎన్సీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కే సత్యనారాయణ వివిధ పత్రికల్లో జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిస్ నేతగా విశేష సేవలందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం సేవనందిస్తూ వస్తున్నారు. అయన ఎంపిక పట్ల పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు, వివిధ పత్రికల యాజమాన్యాలు అభినందనలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.