ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి కూతురు ప్రియాంకగాంధీ ప్రజల్లోకి వెళుతున్నారు. అసోంలో పర్యటించిన ఆమె తాజాగా పోటీ కూడా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది..

కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు జరిగే కన్యాకుమారి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.