పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై.. ఆ దేశ  మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో పీఎస్బీ పెద్దలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే ఆటగాళ్లకు కరోనా సోకిందని విమర్శించారు. మిగతా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే పీఎస్బీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అక్తర్  ఫైర్ అయ్యారు.  ఆటగాళ్లకు కరోనా సోకడంతో పీఎస్ఎల్ ( పాకిస్థాన్ సూపర్ లీగ్) వాయిదా పడింది. ఇందుకు కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డేనని అక్తర్ మండిపడ్డారు.