మార్స్ అద్భుతమైన ఫోటో

నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ మరో కీలక అడుగు వేసింది. అంగారకగ్రహం మీద తొలిసారి విజయవంతంగా టెస్టు డ్రైవ్ చేపట్టిన ఈ రోవర్.. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్లు.. అంటే 21.3 అడుగుల దూరాన్ని నడిచింది. అంతేకాదు.. తన నడకలో భాగంగా 150 డిగ్రీల ఎడమవైపునకు తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించింది. దీనికి సంబంధించి రోవర్ పంపిన ఫోటోల్లో ట్రాక్ జాడలు కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. తడి పొడి నేల మీద నడిచినట్లుగా ఉండటం గమనార్హం.