ఇండోనేషియాలో 182కు చేరిన మరణాలు.. వందలాది మంది క్షతగాత్రులు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఇండోనేషియాలోని ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కడి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 182కు చేరుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. క్షతగాత్రులు వందల సంఖ్యలో ఉన్నారు.

మృతుల్లో ఎక్కువ మంది 17ఏళ్లు కూడా నిండని యువకులే అధికంగా ఉండటం గమనార్హం. గెలుపోటములపై జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి తొక్కిసలాటకు దారితీసింది.

సురబాయి జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోవడంతో ఇరు జట్ల అభిమానుల మధ్య చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఘర్షణను చల్లార్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. ఈ సందర్భంగా స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. దీంతో వందలాది మంది తీవ్రగాయాలు కాగా, మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.