క్రాంతినికేతన్ సేవా సంస్థ అధ్యక్షుడు క్రాంతికుమార్ వితరణ

• ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థికసాయం
రచ్చబండ : క్రాంతినికేతన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుంకరి క్రాంతికుమార్ వితరణ చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ కేంద్రంగా ఆయన రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.

కరోనా సమయంలో ఎందరో అసహాయులకు నేనున్నానంటూ భరోసానిస్తూ వందలాది మందికి నిత్యావసరాలను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం తన పుట్టిన రోజును పురష్కరించుకొని ఓ విద్యార్థికి ఆర్థికసాయం అందజేసి వెన్నుతట్టారు.

గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి చెందిన తుమ్మకొమ్మ శివకు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రాగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శివ కుటుంబ సభ్యులు సుంకర క్రాంతి కుమార్ ను సంప్రదించారు. ఈ మేరకు స్పందించిన ఆయన శివకు తక్షణ సాయంగా రూ.10వేల ఆర్థిక సాయం అందించారు.

తన విద్య అవసరాన్ని బట్టి మరింత సహకారం అందిస్తామని క్రాంతికుమార్ శివ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలు జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ గౌడ్ యారావ సురేష్, జంపాల శ్రావణ్ ,సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.