జాతీయ ఫిస్ట్ బాల్ టోర్నమెంట్ షురూ

కంటోన్మెంట్ : హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని న్యూ బోయినపల్లి, సెయింట్ పీటర్స్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ బాలుర, బాలికల, ఆరో సీనియర్ ఫిస్ట్ బాల్ జాతీయ పోటీలు ప్రారంభమయ్యాయి. జూన్ 3వరకు ఈ పోటీలు కొనసాగతున్నాయి.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఛండీగఢ్, మహారాష్ట్ర, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, కేరళ, తదితర 17 రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి అని తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ తెలిపారు.

పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, గౌరవ అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి హాజరయ్యారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అల్వాల్ సహారా ప్రెసిడెంట్ పీవీ మానాలన్, వుయ్ కేర్ పేస్ట్ కంట్రోల్ ఎండీ విక్రమ్ సింహా, హోప్ టీమ్ ఫౌండర్ విజయ్, తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ ఫ్రాంక్లిన్ సహకారం అందజేస్తున్నారని తెలిపారు. అదే విధంగా బీఎన్ శ్రీనివాస్, బానుక మల్లికార్జున్, మర్రి లక్ష్మణ్ రెడ్డి, సెయింట్ పీటర్స్ హై స్కూల్ కారస్పెండెంట్ టీబీ రెడ్డి, బోర్డ్ మాజీ సభ్యులు కే.పాండు యాదవ్ దాతలుగా సహకరిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగదీష్, ఫిస్ట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ కొమ్ము వెంకటేష్, హోప్ ఫౌండేషన్ విజయ్, కిరణ్, ఫిస్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్, మాల్యాద్రి, వర ప్రసాద్, రాజు, శశి, పవన్, పేరుక మహేందర్, శశికాంత్, రాజేష్, జంపన ప్రతాప్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.