• టీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
సిరిసిల్ల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను ఈ సారి పెంచాలని టీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం టీడబ్ల్యూజేఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్) 3వ మహాసభలు జరిగాయి.
టీడబ్ల్యూజేఫ్ జిల్లా అధ్యక్షుడు పెరక రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మొదట ఇటీవల మరణించిన జర్నలిస్టులకు సంతాపం ప్రకటించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించారు. అనంతరం మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయలన్నారు.
జర్నలిస్టులకు కనీస వేతన సౌకర్యాలు ముఖ్యంగా పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు. అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయలన్నారు. కొత్త వారికి శిక్షణ తరగతులు నిర్వహించి నాన్యమైన వార్తలు రాసేలా ప్రోత్సచించాలన్నారు. దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని అన్నారు.
ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీటినీ తక్షణమే నెరవేర్చాలన్నారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఆనందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మజీద్, ఇతర జిల్లాల అధ్యక్షులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.