లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లుకు ఎక్స్ లెంట్ క్లబ్ అవార్డు
– ఆమనగల్లు లయన్స్ క్లబ్ పిఆర్వో పాషా
రచ్చబండ, ఆమనగల్లు: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు కు డిస్టిక్ 320a లో ని 2021- 2022 సంవత్సరానికి గాను ఎక్సలెంట్ క్లబ్ అవార్డు లభించింది. దీనితోపాటు ఫోటో ఎగ్జిబిషన్ అవార్డు, బెస్ట్ బ్యానర్ అవార్డు లభించినట్లు పిఆర్వో పాషా తెలిపారు.
సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగిన 320A జిల్లా ఏడవ వార్షికోత్సవం డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరు రఘు, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఎస్ రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డులు అందుకున్నట్లు పిఆర్ఓ పాషా తెలిపారు.వైస్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ మాజీ గవర్నర్ జి.చెన్నకిషన్ రెడ్డి, జే.రమేష్ బాబు, ఎస్ నరేందర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ బి. వెంకటేష్, జోన్ చైర్మన్ కె. రామ్ రెడ్డి, క్లబ్ అధ్యక్షులు బైరి కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి కుడుముల భాస్కర్ రెడ్డి, కోశాధికారి కర్నాటి కొండల్ రెడ్డి, లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ వీరబొమ్మ బిక్షపతి, జిల్లా చైర్మన్ ఓంకారం, అంజయ్య, బండేలా రామచంద్రారెడ్డి, జూలూరు రమేష్, జూలూరు లింగయ్య, లైయన్స్ క్లబ్ సభ్యులు సునంద అంజయ్య, బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్, పి.వెంకట్ రెడ్డి, గుజ్జరి నరసింహ, బి.వెంకట్, విష్ణు వాస్ రెడ్డి, పిఆర్ఓ పాషా లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు