ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్డండలో అమ్మ పాదపూజ

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్డండలో అమ్మ పాదపూజ

– హాజరైన ఎమ్మెల్సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
– సృష్టికి మూలం.. కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని కొనియాడిన నేతలు

రచ్చబండ, ఆమనగల్లు (వెల్దండ): సృష్టికి మూలం, కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని ఎమ్మెల్సి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మ పాద పూజ, ఆశీర్వచనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సి కసిరెడ్డి హాజరై మాట్లాడారు.

పాద పూజ కార్యక్రమంలో సుమారు 3,000 మంది మహిళామూర్తులకు వారి పిల్లలు అంగరంగ వైభవంగా పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించి తల్లుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఎమ్మెల్సీ కసిరెడ్డి, వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ అనే రెండక్షరాల మీద మన మనుగడ సాగుతుందని చెప్పారు. రాశులతో పాటు సృష్టిప్రదాతలు కూడా ఒక అమ్మ కన్న బిడ్డలేనని, వారు కూడ అమ్మ ప్రేమను పొందిన వారేనని పేర్కొన్నారు.

పురిటి నొప్పులతో నవ మాసాలు మోసి తన జన్మను, జీవితాన్ని పణంగాపెట్టి మనకు ప్రాణాన్ని పోసింది అమ్మేనని, మంచి పౌర సమాజ నిర్మాణం కోసం అమ్మ పాద పూజ కార్యక్రమం ఎంతగానోదోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఉప్పల వెంకటేష్ తన తల్లికి పాద పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పాద పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళామూర్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన వస్ర్తాలను అందజీశారు.

కార్యక్రమంలో ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నిర్మలా శ్రీశైలంగౌడ్, స్థానిక సర్పంచ్ భూపతిరెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ సంజీవ్ యాదవ్, శ్రీ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ దాసు, తలకొండపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.