– బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత తులసిరామ్ విజయకుమార్
రచ్చబండ, శంకర్ పల్లి: కేంద్ర ప్రభుత్వం పడుతున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు గడపగడపకు వెళ్లి వివరించాలని బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత వర్రీ తులసిరామ్ విజయకుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఆలంఖాన్ గూడ, ఏరువగూడ గ్రామాలలో ఆదివారం శంకర్ పల్లి మండల బిజెపి అధ్యక్షులు బసగల రాములుగౌడ్, మాజీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎల్.
ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బిజెపి పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి కార్యకర్తలు వివరించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ తో పాటు వివిధ పథకాలను ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. రాను రాను భారతీయ జనతా పార్టీకి గ్రామాలలో ఆదరణ పెరుగుతుందని,అందుకోసం కార్యకర్తలు సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ ముదిరాజ్, ప్రభాకర్, శివ కుమార్, మనీష్, కుమార్ గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీశైలం, శ్రీకాంత్ యాదవ్, సాయికుమార్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.