shanker pally Mpp.. సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి  

  • సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులకు శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పిలుపు

రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కృషి చేయాలని శంకర్ పల్లి ఎంపీపీ డి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించిన గ్రామ పంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు ప్రశంసా పత్రాలతో పాటు, మెమెంటోలను అందించారు.

 

మండలంలోని జనవాడ, మిర్జాగూడ, దొంతాన్పల్లి, మహారాజ్ పేట్, గోపులారం, పొద్దుటూరు, టంగుటూరు, పిల్లిగుండ్ల, కొండకల్, మోకిలా, మాసానిగూడ, ఏరువా గూడా, పరివేద, చెందిప్ప, గాజుల గూడ, శేరిగూడ, లక్ష్మారెడ్డి గూడ, మహాలింగాపురం, రావులపల్లి, గ్రామపంచాయతీలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను ఆయా గ్రామ సర్పంచులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఈఓఆర్డి గీత, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్, జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.