రచ్చబండ : లైంగిక దాడులకు వివిధ దేశాల్లో పలు రకాల శిక్షలు అమలులో ఉంటాయి. కొన్ని దేశాల్లో పరిమిత జైలు జీవితం, మరికొన్ని దేశాల్లో దీర్ఘకాల జైలు శిక్షలు ఉంటాయి. ఇంకొన్ని దేశాల్లో ఉరి శిక్షలు, శిరచ్ఛేదం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి.
థాయ్ లాండ్ దేశంలో లైంగిక నేరస్థులకు మరో రకమైన శిక్ష అమలు చేస్తుంది. ఇక్కడ జైలు శిక్షకు బదులుగా స్వచ్ఛందంగా ఖైదీలకు కెమికల్ క్యాస్ట్రేషన్ అందించనుంది.
ఇటీవలే ఆ దేశం ఈ చట్టాన్ని సెనెట్ లో ఆమోదించింది. దీని ప్రకారం.. సెక్స్ నేరస్థులకు వారి జైలు శిక్షలను తగ్గించడానికి బదులు రసాయనాలు అందించడానికి అధికారులకు అనుమతి ఇస్తుంది.
కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల దోషుల్లో నపుంసత్వం రానుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలనూ తగ్గించడానికి ఇంజక్షన్లు ఇస్తారు. దీంతో దుండగులకు రోగం కుదురుతుందని అక్కడి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.