రష్యాతో యుద్ధం ఆరంభం నుంచి ఉక్రెయిన్ లో 5,000 మంది పౌరుల మృతి

రచ్చబండ : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. యుద్ధం ఆపాలని వివిధ దేశాలు అభ్యర్థిస్తున్నా, అమెరికా లాంటి దేశాలు హెచ్చరిస్తున్నా ఆయా దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ దశలో తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది.

ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకూ 5,000 మంది పౌరులు మరణించారు.. 6,500 మంది గాయపడ్డారు.. అని యూఎన్ మానవ హక్కుల కార్యాలయమైన ఓహెచ్సీహెచ్ఆర్ తెలిపింది.

వాస్తవమైన మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అంచనా. ఓహెచ్సీహెచ్ఆర్ ఉక్రెయిన్ లో డజన్లకొద్దీ మానవ హక్కుల మానిటర్లను కలిగి ఉంది. వారి ద్వారా విస్తృత సమాచారాన్ని సేకరించింది.