రెండు నిమిషాలకు నూరు మంది జననం!

ఔనండి నిజమే.. అదీ మన దేశంలోనే.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం మనది. అలాంటి మన దేశంలో జననాల రేటు కూడా అధికంగానే ఉంది. యావరేజ్ లో మన దేశంలో నిమిషానికి 50 మంది పుడుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఓ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి రెండు నిమిషాలకు 100 మంది జన్మిస్తున్నారని తేలింది. అంటే నిమిషానికి 50 మంది పుడుతున్నారు. రాష్ట్రాల వారీగా నిర్వహించిన సర్వేలో విభిన్న ఫలితాలు రావడం గమనార్హం.

ఆ సర్వే ప్రకారం.. జననాల సంఖ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉండగా, కేరళ, ఢిల్లీలో అతి తక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో నిమిషానికి 11 మంది జన్మిస్తుండగా, బిహార్ రాష్ట్రంలో ఆరుగురు చొప్పున జన్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నిమిషానికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున జన్మిస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. ఇదీ లెక్కన్న మాట.