తెలుగు సినీ హీరోకు అస్వస్థత.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స

రచ్చబండ, ఆన్ లైన ప్రతినిధి : మరో తెలుగు సినీ హీరో అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

బాణం, సోలో చిత్రాలతో నటుడిగా పరిచయమైన శ్రీవిష్ణుకు ఇటీవల డెంగీ ఫీవర్ వచ్చింది. తాజాగా ఇంటికి పంపగా ఆయన రక్తంలో ప్లేట్ లెట్స్ భాగా తగ్గి నీరసించి అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, సినీ కళాకారులు కోరుకుంటున్నారు. శ్రీవిష్ణు ప్రస్తుతం అల్లూరి చిత్రంలో నటిస్తున్నారు.