రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 53.. ఎందరు ఎంపీలు, ఎమ్మెల్యేలో తెలుసా?

రచ్చబండ : ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న మన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరి ఓట్లు చెల్లలేదు. అదీ మన దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి ఎన్నికల్లో కావడం గమనార్హం. మొత్తంగా 53 మంది తమకు ఓటేయరాదని నిరూపించుకున్నారు.

తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మన దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేశారు. వారిలో 38 మంది ఎమ్మెల్యేల, 15 మంది ఎంపీల ఓట్లు చెల్లలేదని ఎన్నికల సంఘం ధృవీకరించింది.

దీనిపై విమర్శకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనను తెలుపుతున్నారు. కొందరు శృతిమించేలా కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులకే ఓటేయరాక పోవడం సరికాదు కదా.