రచ్చబండ : ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంబరాన్నంటేలా చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని నిర్ణయించింది. ఇంటింటి త్రివర్ణ ఉద్యమంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదం తెలిపిన రోజును పురస్కరించుకొని ప్రధాని ట్వీట్లు చేశారు.
‘ఇంటింటా త్రివర్ణ పతాక’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారు. దేశ స్వాతంత్ర్యం కోసం, మూడు రంగుల జెండా రెపరెపల కోసం పోరాటం చేసిన జాతి నేతల పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. జాతినేతల ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందామని తెలిపారు.