రచ్చబండ : గత వారం రోజుల పాటు రాష్ట్రాన్నే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసిన వాన మళ్లీ ముంచుకొచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే శుక్రవారం ఉదయం నుంచి వాతావారణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురిశాయి.
ఇప్పటికే శుక్రవారం రాష్ట్రలోని హైదరాబాద్ సహా పలుచోట్ల భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీ వర్షం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, టోలీచౌకీ, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్ పేట, రామంతాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అదే విధంగా రాష్ట్రంలోని పలుచోట్ల కూడా భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో పాటు ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.