గర్భిణిపై గ్యాంగ్ రేప్

ప్రతీ సమాజంలో మహిళను ఆట వస్తువుగా చేసి ఆడుకోవడం అలుసుగా మారింది. అక్కడా, ఇక్కడా అని లేదు. ఏ దేశంలోనైనా మహిళలపై దారుణాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా పాకిస్థాన్ దేశంలో జరిగిన ఓ ఘటనపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇటీవల 25 ఏళ్ల యువతిపై కదులుతున్న ట్రైన్ లోనే గ్యాంగ్ రేప్ జరిగిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఓ గర్భిణిపై కొందరు దారుణానికి ఒడిగట్టారు.

పాకిస్థాన్ లో జరిగిన ఈ ఘటనలో ఆయుధాలు కలిగిన ఓ ఐదుగురు ఆగంతుకులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో ఉన్న గర్భిణి భర్తను తాళ్లతో బంధించారు. ఆ గర్భిణిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

తనను వదిలేయమని ఆ నిస్సహాయురాలు ఆ దుండగుల కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు. సరి కదా ఒకరి వెంట మరొకరు దుర్మార్గానికి ఒడిగట్టారు. ఇలాంటి ఘటనలో ఎక్కడో ఓ చోట జరుగుతూ వస్తుండటం శోచనీయం.