విశాఖ తీరంలో విలాసాల నౌక

అమెరికా మరికొన్ని దేశాల్లో సెలవు దినాల్లో క్రూయిజ్ నౌకల్లో ప్రయాణించడం ఒక హాబీ. మనదేశంలోనూ ముంబైలో మాత్రమే క్రూయిజ్ నౌక అందుబాటులో ఉంది. ఇక అలాంటి నౌక మన తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది.

వైజాగ్ తీరంలో ‘కార్డేలియా ఎమ్వి ఎంప్రెస్’ అన్న పేరున్న క్రూయిజ్ నౌక ఇక నుంచి విహరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. దీంతో విశాఖ తీరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. విదేశాలకు వెళ్లేవారినీ ఆకర్షించనుంది.

క్రూయిజ్ అంటే ఏమిటి?
క్రూయిజ్ అంటే విలాసాల నౌక అన్నమాట. సముద్రంపై తేలియాడే స్వర్గంగా పేర్కొంటారు. ప్రపంచ టూరిజంలో భాగంగా ఇదో నవశకం అన్నమాట. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో క్రూయిజ్ నౌకలపై కూడా ఆదేశాలకు ఆదాయం సమకూరుతుంది.

క్రూయిజ్ నౌక విశేషాలు ఏంటి?
క్రూయిజ్ నౌకలో 11 అంతస్థులున్న ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఉంటాయి. థియేటర్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ ఫూల్, ఆడిటోరియం ఉంటాయి. కొన్ని రోజుల పాటు సముద్రంపై విహరించేలా సకల సౌకర్యాలు ఉంటాయి.