పుష్ప-2 సినిమా కోసం బన్నీ, సుకుమార్ రెమ్యునరేషన్ రెట్టింపు

రచ్చబండ : పుష్ప– ది రైజ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. హీరో అల్లు అర్జున్ కు, దర్శకుడు సుకుమార్ కు మంచి పేరు తెచ్చింది. 2021లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లతో రూ.350 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది.

ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ పేరుతో వచ్చే సీక్వెల్ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు తెలిసింది. హీరో, దర్శకులతో పాటు మొదటి సినిమాలోని వారే ఈ సినిమాకు పని చేస్తున్నారు.

పుష్ప-2 సినిమా కోసం హీరో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసినట్లు వార్తలొచ్చాయి. పుష్ప-ది రైజ్ కోసం బన్నీ రూ.50 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. అదే సీక్వెల్ సినిమా కోసం దానిని రెట్టింపు చేసి రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.

దర్శకుడు సుకుమార్ కూడా తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేశారని వార్తలొచ్చాయి. పుష్ప-ది రైజ్ కోసం ఆయన రూ.18 కోట్లు వసూలు చేశాడని, సీక్వెల్ సినిమా కోసం రూ.40 కోట్లు వసూలుకు టెండర్ వేశారని వార్తలు గుప్పుమన్నాయి.

నిర్మాణ దశలో ఉన్న పుష్ప-2 సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 80శాతం మేరకు తారాగణం, సాంకేతిక వర్గం మొదటి సినిమాకు చేసిన వారే కావడం గమనార్హం.