మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడిన బస్సు

రచ్చబండ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. 15మందికి గాయాలయ్యాయి. పలువురు నదిలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పూణె నగరానికి 40 మందితో ఓ బస్సు వెళ్తుంది. ధార్ జిల్లా జిల్లా బాలఘాట్ సమీపంలోని నర్మద నది వంతెన పైనుంచి వెళ్తుండగా అదుపు తప్పింది. వంతెన పైనుంచి నదిలోకి దూసుకుపోయింది.

ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. రెస్క్యూ టీం 15మందిని రక్షించింది. పలువురి ఆచూకీ దొరకడం లేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.