రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కుమారుడి దుర్మరణం

రచ్చబండ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా సీనియర్ నేత కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెగట్టె మల్లికార్జున్ రెడ్డి కుమారుడు రెగట్టె దినేష్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు పెద్ద గోల్కొండ సమీపంలో రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో దినేష్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో డీసీఎంతో దినేష్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. అయితే శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి, టీఆర్ఎస్ నేత రేగట్టె మల్లికార్జున్ రెడ్డి నార్కట్ పల్లి ఎంపీపీగా పనిచేశారు.