నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం దారుణం చోటుచేసుకొంది. ఓ యువకుడు ఓ అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో శ్రీకాంత్ అనే యువకుడు (35) ఎత్తయిన అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఆయువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వివరాలు సేకరించే పనిలో పడ్డారు.